8 ఏళ్ల అనంతరం మొత్తానికి అల్లరి నరేష్ ఒక మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి బాక్సాఫీస్ వద్ద అయితే డిసెంట్ కలెక్షన్స్ అందుకుంది. అనుకున్నంత రేంజ్ లో డబుల్ ప్రాఫిట్స్ అందుకోకపోయినప్పటికి ఎదో ఒక విధంగా నరేష్ అయితే విజయాన్ని అందుకోవడం సంతోషించదగిన విషయం. ఇక ఇటీవల నాందికి మరో బోనస్ లాంటి ఆఫర్ రావడంతో నిర్మాతకు మరింత లాభం దక్కింది.
నాంది ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకుంటారనేది గత వారం నుంచి వైరల్ అవుతున్న ప్రశ్న. ఇక మొత్తానికి ఆహా అనిపించే ధరకు aha వారికే దక్కింది. ఈ సినిమా రూ.2.75 నుంచి 3కోట్ల మధ్యలో అమ్ముడైనట్లు సమాచారం. ఒక విధంగా నాంది సినిమాకు ఇది బోనస్ అని చెప్పవచ్చు. అలాగే దిల్ రాజు దాదాపు అన్ని భాషలకు సంబంధించిన రీమేక్ రైట్స్ ను అందుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయవచ్చని టాక్ వస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment