సాయి పల్లవి.. సరిలేరు నీకెవ్వరు!! 


గ్లామర్ డోస్ పెంచితే చాలా తొందరగా హీరోయిన్ గా క్లిక్కవుతారని చాలా మంది చెబుతుంటారు. నిజానికి కొంతమంది హీరోయిన్స్ కూడా అదే తరహాలో రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్స్ తో హడావుడి చేస్తుంటారు. అయితే సాయి పల్లవి ,మాత్రం అందుకు బిన్నంగా అడుగులు వేస్తుంటుంది. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. 

కేవలం తన నటనతోనే అమ్మడు వీలైనంత వరకు కొత్త ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం విరాట పర్వం అనే నక్సల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్న ఈ కేరళ గర్ల్ అనంతరం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాని పీరియాడిక్ డ్రామా శ్యామ్ సింగరాయ్ తో పాటు పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో కూడా నటించనుందట. ఈ విధంగా సాయి పల్లవి విభిన్నమైన సినిమాలతో సరిలేరు నీకెవ్వరు అనే విధంగా ముందుకు వెళుతోంది.



Post a Comment

Previous Post Next Post